వాల్మీకి రామాయణంలోని ఒక అద్భుతమైన ఘట్టము. ఇది పండిత శ్రీమాన్ రాజగోపాలాచార్యులు గారు తమిళంలో వ్రాయగా ఆంగ్లంలోకి ప్రొ. నవనీత రావు గారు అనువదించారు.

సుగ్రీవుడి పట్టాభిషేకం జరుగుతుంది. అధికారం ఆధిపత్యం లభించాకా సుగ్రీవుడు ఆనందాలలో మైమరిచి మాత సీతాదేవి జాడను వెతికిపెట్టడంలో తాను శ్రీరాముడికి ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతిజ్ఞను మరుస్తాడు. కానీ హనుమ మాత్రం మరువడు. తగిన సమయం చూసి, తన రాజు, మిత్రుడు ఐన సుగ్రీవుడికి ఎంతో మృదువుగా గుర్తు చేస్తాడు.

NIKE

నీవు వంశపారంపర్యంగా పూర్వీకుల నుండి రావలసిన రాజ్యాధికారం తిరిగి సంపాదించావు సంపూర్ణమైన భద్రతను పొందావు తత్ఫలితాలనీ ఆనందిస్తున్నావు.
అనుభవిస్తున్నావు. కానీ నిర్వర్తించాల్సిన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి.

నీ సహచరులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాల్సి ఉంది. అట్లు చేయడంవల్ల నీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అధికారం మరింత దృఢపడుతుంది.

తనదైన ఇష్టాలను సంతోషాలని సైతం పక్కనపెట్టి తాను మిత్రులకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి తగు చర్యలు చేపట్టాలి. అప్పుడే కదా రాజు అధికారం పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి.

కాలాతీతం కాకమునుపే వాగ్దానాలను నెరవేర్చడం అభిలషణీయం. శ్రేయోదాయకం.
ఏది ఏమైనా ఆలస్యం తగదు. ఇచ్చిన సమయానికి నెరవేర్చలేకపోతే ఆ తర్వాత ఏం చేసినా నిష్ప్రయోజనమే.

ఎవరికి వాగ్దానం చేసామో వారు గుర్తుచేసి ప్రేరేపించేట్లు ప్రవర్తించరాదు.

నేను చెప్పినా చెప్పకున్నా ఇవన్నీ నీకు తెలిసిన విషయాలే

మనకు శ్రీరాముడు అందించిన సాయము తెలుసు. ఆ విషయం మరియు ఇచ్చిన వాగ్దానం గుర్తుంచుకుని అది నెరవేర్చడానికి రాముడు ప్రేరేపింపకముందే కార్యాచరణ అమలు చేయాలి. వర్షఋతువు కూడా ముగిసింది. ఇక ఆలస్యం చేయటానికి కారణం ఏదీ లేదు.

శ్రీరాముడు మనకు పరమమిత్రుడు సహనశీలి. ఆ చనువుతో ఆకారణంతో ఉదాసీనంగా ఉంటూ ఇక ఏ మాత్రం వాయిదా వేయడం తగదు. మనము ఆయనకార్యమును సాధించి పెట్టవలసియున్నది. కనుక వెంటనే సీతాన్వేషణకు పూనుకొనవలె.

అపవాదులెదురౌనని ప్రమాదములు పొడచూపునని తెలిసినా వెరవక పట్టించుకోకుండ శ్రీరాముడు నీ శత్రువును హతమార్చి ఇచ్చిన మాటను గడువులోగా నిలబెట్టుకున్నాడు కదా ?

అంతే నిక్కచ్చితనంతో మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కార్యోన్ముఖులమై సాధించవలెను. ఫలప్రదం చేయవలెను.

అని హనుమంతుడు పరి పరి విధాల సుగ్రీవుడికి స్పృహ తెప్పించే ప్రయత్నాలు చేసి, తన మిత్రధర్మాన్ని చక్కగా నిలబెట్టుకుంటాడు. మారుస్తాడు కర్తవ్యోన్ముఖుడిని చేస్తాడు.

ఆ మిత్ర ధర్మాన్ని ఆదర్శంగా తీసుకుని అమిత్ర అధర్మ వర్తనలని మనసావాచాకర్మణా తరిమివేసి ఒకరికొకరం ఒక్కొక్కరం మరొక్కరి ఒకరికొకరి హితం కోసం ఉపకరించుకునే విషయాలు మాత్రమే పంచుకుందాం.

జై శ్రీమన్నారాయణ

Search LAtelugu