శ్రీమద్రామాయణములోని‌ ఏడు కాండలలో అరణ్య కాండ సాధనకు సంబంధించిన కాండము. ఈ కాండములో మనకు రెండు పాత్రకు ప్రత్యేకముగా కనిపిస్తాయి.‌ వాటిలో ఒకటి శూర్ఫణఖ; రెండవది శబరి. వీరిద్దరి స్వభావాలను పరిశీలిస్తే...

NIKE SB

శూర్ఫణఖ: కామరూపము, క్రోధ స్వరూపము, ముక్కు చెవులు పోగొట్టుకుని దుఃఖిస్తుంది. వికార స్వరూపిగా మారి విలపిస్తుంది.

కామక్రోధాల పరిస్థితి ఎప్పుడూ అంతే! అందుకే సాధకులైనవారు కామక్రోధాలను నిగ్రహించుకోవాలి అని ఈ కాండము చెబుతుంది మనకు. శూర్పణఖ లాగా జీవితాన్ని పాడుకాకుండా చూచుకోవాలని వాల్మికి మహర్షి సూచిస్తున్నారు.

శబరి: శ్రీరామ లక్ష్మణులు వచ్చినపుడు రాముని కళ్ళారా చూచింది. రామా! నేను అధములలో అధమమైన నీచజాతి స్థ్రీని. మందమతిని. మూర్ఖురాలను. హే పాపవినాశకా! నిన్ను నేను ఎలా స్థుతించేది? అని అన్నది. దానికి రాముడు - నాకు కేవలము భక్తి ప్రధానము. జన్మము, వంశము, కులము, ధనము, శక్తి, సామర్త్యము కంటే భక్తియే నాకు ముఖ్యము. భక్తి లేనివాడు జలములేని మేఘము వంటివాడు అని అన్నాడని తులసీ రామాయణములో ఉంది.

కనుక శబరిది ప్రేమస్వరూపము. ప్రేమమూర్తి అయిన శ్రీరాముని దర్శించింది. రామునితో భాషించింది. రాముని పాదాలను అర్చించింది. దివ్యమైన దేహాన్ని పొంది రాముని అనుగ్రహానికి పాత్రురాలయింది. ఉత్తమ లోకాలకు వెళ్ళింది.

ఈ రెండు పాత్రలను మన మనస్సులో ఉంచుకుని సాధకులు తమ జీవితాలను చరితార్థము చేసుకోవాలని వాల్మీకి మహర్షి మనకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నారు. సదా హృదయములో భక్తి నిండాలి. కామము ప్రవేశించకుండా చూచుకోవాలి.

జై శ్రీమన్నారాయణ

Search LAtelugu