హయగ్రీవ హయగ్రీవ అనే శబ్దాన్ని పలికితే చాలు అట్టి మానవుని పాపాలన్నీ తొలగి అతని దరిద్రం తొలగుతుంది. హయగ్రీవ హయగ్రీవ అని పలికితే చాలు నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలా చువు వస్తుంది. అంటే సర్వవిద్యలూ వస్తాయన్నమాట. హయగ్రీవ హయగ్రీవ అనే ధ్వనిని వింటే చాలు వైకుంఠంయొక్క తలుపులు తెరుచుకుంటాయి. అంటే వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది. హయగ్రీవుని పదములతో మిళితమైన ఈ మూడు శ్లోకములు దివ్యమైనవి. ఎవరైతే వాటిని స్మరిస్తారో వారికి సంపదలు కలుగుతాయి. 

కర్ణుడు కవచకుండలాల వెనుక అసలు రహస్యం..?

కర్ణుడు.. కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి ‘కర్ణుని’ కనలేదు. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు... అంతే. కన్యగా ఉన్న కుంతికి., దూర్వాసమహర్షి ఇచ్చిన మంత్రం ‘సంతాన సాఫల్య మంత్రం’. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే, ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు తప్ప మరే వరాలు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది.

అపురూప శిల్పకళా శోభితం శ్రీకూర్మం

మత్స్యావతారుడైన శ్రీ మహావిష్ణూవుకు ఈ భూమిపై గల ఏెకైక దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం. అందుేక దీనికి ఎనలేని విశిష్టత ఉంది. మహావిష్ణూవు అవతారాల్లో రెండోదైన కూర్మావతారం రూపంలో దైవం ఈఆలయంలో కొలువై ఉంటుంది. అమృతానిెకై దేవదానవులు క్షీరసాగరమధనం చేయడానికి మంధర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా ఉప యోగించారు. ఆసమయంలో వత్తిడికి లోనైన మంధర పర్వతం క్షీరసాగరంలోకి మునిగిపోతుంటే శ్రీమహావిష్ణూవు కూ ర్మావతారాన్ని ధరించి పర్వతం కింద ఆధారంగా నిలచి అమృత మధనానికి సాయం చేశాడు.

పద్యం మొదటి నుండి చదివినా, వెనుకనుండి చదివినా, యతి ప్రాసలతో సహా, అదే పద్యం వస్తుంది , ఇది అనులోమ విలోమ కందం.
నారదుడు సత్యభామ చేత పుణ్యక వ్రతము చేయించి కృష్ణుని దానముగా గైకొని ఆయనను స్తుతించిన పద్యము

నాయశరగసారవిరయ
తాయనజయసారసుభగధరధీనియమా
మాయనిధీరధగభసుర
సాయజనయతాయరవిరసాగరశయనా!

ఇది నంది తిమ్మన గారి పారిజాతాపహరణం లోనిది. మంచి శరీరము గలవాడా!సాగరశయానా!అచలమైన బుద్ధి,కట్టుబాట్లు గలవాడా! లక్ష్మీ దేవి శుభములకు స్థాన భూతుడైన వాడా! లక్ష్మీ వాసుండును,కళ్యాణరూపుండైన శరీరము గల సుందరుడా!సర్వదేవాత్మకుడవైన వాడా!నీ నీతియను,వేగమైన బాణములచే దుర్జనులను శిక్షించి సుజనులను రక్షించి ధర్మము నెలకొల్పి అందరి మెప్పును పొందిన వాడవు వామనావతారంలో ఆకాశము నంటి సూర్యుని తేజమును మించి పోయినావు.అని నారదుడు స్తుతించెను.

 

14 లోకాలు వివిధ పరిధుల్లో ఈ సృష్టిలో ఉన్నాయి. విశ్వంలో ఈ 14 లోకాలు ఉండడమే కాదు, భూలోకంలో కూడా వివిధ దేశాలను వీటికి అన్వయించి చెప్పే విధానం ఉంది, అలాగే ఈ శరీరంలోనే ఈ 14 లోకాలను పదునాలుగు భిన్న చైతన్య స్థితులకు సూచనగా చెప్పే సంప్రదాయం కూడా ఉంది. మన శరీరంలో మూలాధారం నుంచి పైకి, క్రమంగా స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలనే 6 చక్రాలు ఉన్నాయి. వాటికి పైన ఉన్నది సహస్రారం/ సహస్రపద్మం. ఇవన్నీ కలిపి 7. అలగే మూలాధారానికి దిగువన కూడా 7 చక్రాలున్నాయని కొన్ని ఆగమాల్లో కనిపిస్తుంది. ఈ మొత్తం అన్నీ కలిపి 14. వ్యక్తి యొక్క చైతన్యం ఉన్న స్థాయిని అనుసరించి, అతడి మానసిక స్థాయి ఏ లోకంలో ఉందో తెలుసుకోవచ్చు. 

Search LAtelugu