ప్రతిభట శ్రేణి భీషణ వర గుణ స్తోమ భూషణ
జనిభాయ స్దాన తారణ జగడవస్థాన కారణ |
నిఖిల దుష్కర్మ కర్షణ నిగమ సద్ధర్మ దర్శన
జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన

త్రిలోకసంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న భక్తులను పలకరించేందుకు బయల్దేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్లాడు.

అయ్యా! వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు. విష్ణుభగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా?’ అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని. ‘విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు. నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను,’ అంటూ బదులిచ్చారు నారదులవారు. ‘అయితే స్వామీ! ఈసారి మీరు వైకుంఠానికి వెళ్లినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి’ అని వేడుకున్నాడు ఆ ముని.

సరేనంటూ నారదులవారు ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. ‘మిమ్మల్ని చూస్తే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామీ! ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?’ అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుని ముంచెత్తాడు.

విష్వక్సేనుడు ఎవరు?

యస్య ద్విరద వక్త్రాద్యాః        పారిషద్యా పరశ్శతం

విఘ్నం నిఘ్నంతి సతతం    విష్వక్సేనం తమాశ్రయే

ఎవరైతే గజ ముఖుడైన, (విష్ణు సైన్యాదిపతియైన) విష్వక్సేనుని ఆశ్రయిస్తారో, ఆయన ఎల్లప్పుడూ మరొక వంద అడ్డంకులనైనా తొలగిస్తాడు. విష్వక్సేనుడు విష్ణు గణాలకు అధిపతి. విఘ్నేశ్వరుడు శివ గణాలకు అధిపతి. ఇద్దరూ గజ ముఖులే. కాకపొతే విఘ్నేశ్వరుడు ఏక దంతుడు, విష్వక్సేనుడు ద్విదంతుడు. వైష్ణవ ఆలయాలలో విష్వవక్సేనుడిని పూజిస్తారు. రూపు రేఖలలో యితడు వినాయకుని పోలి ఉంటాడు.

కర్ణుడు, కృష్ణుని అడిగాడు-

  • నేను జన్మించగానే నా తల్లి నన్ను వదిలేసింది. అక్రమ సంతానం అవ్వడం నా తప్పా?
  • నేను క్షత్రియ పుత్రుడిని కాదని ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పలేదు.
  • పరశురాముడు కూడా నన్ను క్షత్రియుడిగా గుర్తించి, నాకు వచ్చిన యద్ధ విద్య, అవసరమైనప్పుడు మరిచిపోయేలా శాపం ఇచ్చాడు.
  • నేను వేసిన బాణం అనుకోకుండా ఒక ఆవుకి తగిలి మరణించింది. ఇందులో నా తప్పు లేకోపోయనా, ఒక ఋషి నన్ను శపించాడు.
  • ద్రౌపతి స్వయంవరంలో నాకు అవమానం జరిగింది.
  • మాతా కుంతీ తన బిడ్డలను కాపాడుకోవడం కోసం మాత్రమే చివరిగా నాకు నా జన్మ రహస్యాన్ని చెప్పింది.
  • నాకు లాభించినది ఏదైనా ఉందంటే అది అంతా దుర్యోధనుడి ద్వారా మాత్రమే లభ్యమైంది.
  • కాబట్టి నేను దుర్యోధనుడి పక్షాన పోరాడడం తప్పు ఎలా అవుతుంది?

ఒక నాడు నారద మహా ముని పులస్త్యుని నక్షత్ర పురుషుని గురించి తెలియ చేయమని అడుగగా, అప్పుడు పులస్త్యుడు చెప్పిన విషయం...అన్ని నక్షత్ర మండలములు విష్షును లో వివిధ అంగములలో నిక్షిప్తమై వున్నాయి. అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రములు పాదములలో, పూర్వాభాద్ర, శతభిషా నక్షత్రములు ఉరువులలో, ఉత్తరాభాద్ర నక్షత్రం మోకాలులో, స్వాతి మరియు విశాఖ నక్షత్రములు స్వామి హృదయములో, ఇలా ప్రతి నక్షత్రము ఒక్కొక్క ఆంగములో వున్నదని తెలియ చేశారు. విష్ణువుని నక్షత్ర అంగ రూపములో ధ్యానిస్తే సకల రోగముల నుండి విముక్తి పొంది అనారోగ్య రహిత జీవితముని పొందుతారు.

Search LAtelugu