• జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
  • రిటైర్‌మెంట్‌ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
  • ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
  • అది కేవలం హిందువులదా?
  • పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?

బ్రహ్మరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని అంటారు. నిజమే! తలరాతను ఎవరూ మార్చుకోలేకపోవచ్చు. కానీ, గీతను చదివితే మాత్రం జీవనరేఖను దివ్యంగా దిద్దుకోవచ్చు. భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహసారం. ఇందులోని అంశాలను చదివి ఆచరిస్తే లోకం స్వర్గధామం అవుతుంది. అర్జునుడు యుద్ధంలోను, మనిషి జీవితంలోను గెలుపు కోసం చదవాల్సింది, నేర్చుకోవాల్సింది గీత నుంచే. భగవద్గీత అనగా భగవంతునిచే గానం చేయబదినదని అర్థం. 

మనిషి తనకు మానవజన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాడు.... పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రమో, పుష్పమో, ఫలమో, జలమో సమర్పించుకుంటూ ఉంటాడు.

ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా సూచకం అయితే కావచ్చునేమోగానీ, అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా? ఇలా ఆలోచిస్తే, ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు. భగవంతుడిదే ఆ యావత్‌సృష్టి. అలాంటివాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే. కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు వూరుకోదు.

ఏ ప్రార్థన చివరిలోనయిన మన ‘ ఓం శాంతి శాంతి శ్శాంతి: ‘ అని మూడుసార్లు ఉచ్చరిస్తుంటాం. ఆ విధంగా మూడుసార్లు అనడంద్వారా మూడు రకాలయినటువంటి తాపాలు (బాధలు) తొలగాలని భగవంతుడిని ప్రార్థించడమన్నమాట.

ఓం శాంతి: (ఆధ్యాత్మిక తాపం చలారుగాక)
ఓం శాంతి: (అధి భౌతిక తాపం చల్లరుగాక)
ఓం శాంతి: (అధివైవిక తాపం చల్లరుగాక)

Search LAtelugu