మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం.

భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.

పూర్వం యజ్ఞవల్క్య మహర్షి మిథిలా నగరంలో నివసిస్తూ ఉండేవారు. ఆయన గొప్ప మహర్షి అని ఆ రోజుల్లో ఎంతో పేరుండేది. నిత్యం యజ్ఞయాగాలను చేస్తూ జీవితం గడుపుతుండేవారు. రాజులు, రారాజులు, తోటి మునులు, ఋషులు ఆయన ఔన్నత్యాన్ని నిరంతరం కీర్తిస్తూ ఉండే వారు.

ఇలా ఉండగా ఓ రోజున ఆయన ఆశ్రమంలోకి ఒక ముంగిస పరుగెత్తుకురావటం ఆయన కంటపడింది. వెంటనే పక్కనున్న వారితో ఆ ముంగిస ఆశ్రమం లోపల ఉంచిన పాలు తాగటానికి వస్తున్నట్లుందని, దాన్ని వెళ్ళగొట్టమని చెప్పారు. ఆ చెప్పటంలో ముంగిసను పరిపరివిధాల పరుషపదజాలాన్ని ఉపయోగించి నిందించారు ఆ మహర్షి. వచ్చిన ముంగిస సాధరాణమైనదికాదు. దానికి అత్యంత జ్ఞానశక్తి ఉంది. దాంతో ఆ ముగింస మానవ భాషలో యజ్ఞవల్క్య మహర్షిని చూసి మాట్లాడటం ప్రారంభించింది.

అమ్మవారు వశిన్యాది దేవతల ద్వారా చెప్పినటువంటి సహస్రనామం లలిత సహస్రనామము. లలిత సహస్రనామము వెనుక చాల పెద్ద నేపధ్యము వున్నది. శివ మహా పురాణాంతర్గతముగా తారకాసుర సంహారం చేయవలసి వచ్చినప్పుడు, పార్వతి పరమేశ్వరులకు కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసురుడు నిర్జింపబడడు. అప్ప్పుడు మన్మధుడు పార్వతి దేవి యందు అనురక్తిని కలిగించేటందుకుగాను పరమేశ్వరుని మీదకు పుష్పబాణములను విడిచిపెట్టాడు.

క్రుద్ధుడు కోపోద్రిక్తుడు అయినటువంటి పరమశివుడు తన మూడో కన్నును తెరిచాడు. ఆ మూడో నేత్రములోనించి వచ్చిన అగ్ని జ్వాలలలో మన్మధుడు దహించుకు పోయి ఒక పెద్ద భస్మరాశి కింద పడింది. ఏదైతే అనుకుని దేవతలు మన్మధుని పంపించారో ఆ కార్యము జరగలేదు సరి కదా అనుకోనటువంటి హఠాత్పరిణామము సంభవించింది. పరమేశ్వరుని మీద మన్మధ బాణములు పడితే పార్వతి పరమేశ్వరులయందు అనురాగము కలుగుతుంది పొందురులకు అని దేవతలు మన్మధుని పంపితే అక్కడ మన్మధ దహనము జరిగింది. దానితో దేవతలందరు బాధతో ఆ భస్మ రాశిని అక్కడే వదిలి వెళ్లిపోయారు.

శుక్లాం భరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

శుక్ల = తెల్లని; అంబర = వస్త్రము, ఆకాశము; ధరమ్ = ధరించినటువంటి; విష్ణుం = అంతటా ఉన్నటువంటి; శశి = చంద్రునివంటి; వర్ణం = రంగు; చతుర్భుజం = నాలుగు భుజములు కలిగినటువంటి; ప్రసన్న = నవ్వుతు, ఆనందంతో ఉన్నటువంటి; వదనం = ముఖము కలిగిన; ధ్యాయే = ధ్యానిస్తున్నాను; సర్వ = అన్ని; విఘ్న = అడ్డంకులు; ఉపశాంతయే = తొలగించు, తగ్గించు.

తెల్లని వస్త్రమును ధరించినటువంటి, అంతటా నిండి ఉన్నటువంటి, చంద్రునివంటి ప్రకాశము కలిగినటువంటి ఓ విఘ్నేశ్వర నేను నిన్ను ప్రార్ధిస్తున్నాను. నాలుగు భుజాలు కలిగినటువంటి ఓ గణాధిపతి నా అడ్డంకులను నీవు తొలగించు.

ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్రమైన శ్రీరంగములో 14 వ శతాబ్ద ప్రారంభములో జరిగిన కధ! అక్కడ గోపాలభట్టర్ అనే వైష్ణవ భక్తుడుఒకరు నివసించేవారు! వారికి భగవద్గీత అంటే పిచ్చి! అదే ఆయన ప్రపంచం !

ప్రతిరోజు శ్రీరంగనాథుని ద్వజస్థంభము వద్ద స్థిరాసనమున గీతాపారాయణముచేయడము వారికి అలవాటు. గళమువిప్పి బిగ్గరగా వారు గీతాపారాయణము చేసేవారు. అది పండితుల చెవులలో అపభ్రంశముగా వినిపించేది. కారణము వీరు శ్లోకములను వుచ్చారణ దోషముగా పఠించడమేగాక మధ్య మధ్యలో వరుసలు వదిలివేసెడి వారు! శ్లోకపువరుసలు గతి తప్పవు !

Search LAtelugu