షోడశోపచారములు చేయు విధానము:

ఎవరైనా ఒక అతిథి, ఒక బంధువు ,మనకు ప్రీతి కలిగించేవారు, లేదా మనము ఒక ఉద్యోగి అయితే మన పై అధికారి,మనకు సహాయం చేసినవారు, మనకు సహాయం చేసేవారు, గురువులు, ఎల్లవేళలా మన శ్రేయోభిలాషులు, మన ఇంటికి వస్తే, ఎలా గౌరవిస్తాము. ఎలా ఉపచారములు (సేవలు) చేస్తాము మరీ చెప్పాలంటే క్రొత్తగా వివాహము చేసుకొన్న దంపతులు, అల్లుడు క్రొత్తగా ఇంటికి వచ్చినా, లేదా క్రొత్త కోడలు క్రొత్తగా మన ఇంటికి వచ్చినా, వారికి చేయు సేవలు,ఉపచారములు ఎలా ఉంటాయో ఊహించండి.

మరి మనకు సకల శుభములను, జీవించుటకు జీవమును, జీవిత మును ప్రసాదించిన ఆ పరమేశ్వరుని పట్ల మనము ఎంత వినయంగా, ఎంత భక్తిగా, ఎంత శ్రద్దగా, త్రికరణ శుద్దిగా మసలుకోవాలి? ఎలా ప్రవర్తించాలి? ఆలోచించండి? మనము చేసే ఉద్యోగము ఆయన ఇచ్చింది కాదా? మనకున్న ఈ సర్వ సంపదలు, వాహనములు, ప్రతి పూట మనము తినే తిండి ఆయన ఇచ్చినదే. చివరకు మనకు జీవాధారమై, మనము పీల్చుచూ, విడుచుచున్న గాలి ఆయనది కాదా? ఈ గాలిని మనము సృజించామా? ఈ ప్రకృతిని మనము సృష్టించామా? మనమునిత్యమూ అనుభవించే ఈ వెలుగు ఎవరిది? మరి అంతటి అంతర్యామి సర్వభూతములందు, సర్వప్రాణికోటియందు, నిండి నిమిడీ కృతమయి ఉన్న పరమేశ్వరుడు మన పూజా మందిరమునకు (మన గృహములోనికి) వచ్చి మనలను కటాక్షిస్తుంటే వారి పట్ల మనము ఎలా ప్రవర్తించాలి.

ఒక పిల్లవాడి కి సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు...?” అని  ప్రశ్నించాడు .... గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా, పాఠాలు చెప్పసాగారు.

ఆరోజు పాఠం

 “ ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” అనే శ్లోకం.

1. మాతా నాస్తి, పితా నాస్తి   నాస్తి బంధు సహోదరః    అర్థం నాస్తి గృహం నాస్తి   తస్మాత్ జాగృత జాగృతః!!

2. జన్మ దుఃఖ జాయాదుఃఖపునః పునః   సంసారసాగర దుఃఖ   తస్మాత్ జాగృత జాగృతః!!

కామశ్చ క్రోధశ్చ, లోభశ్చదేహే తిష్టన్తి తస్కరా   ఙ్ఞానరత్నాపహారాయ   తస్మాత్ జాగృత జాగృతః!!

4.ఆశాయా బధ్యతే జన్తుః   కర్మణా బహు చింతయా   ఆయుః క్షీణః నజానాతి   తస్మాత్ జాగృత జాగృతః!!

సంపదః స్వప్న సంకాశ   యౌవనం కుసుమోపమ్   విద్యుత్ చంచల ఆయుష   తస్మాత్ జాగృత జాగృతః!!

6.క్షణ విత్త క్షణ చిత్త క్షణ జీవిత మావయోః   యమస్య కరుణా నాస్తి   తస్మాత్ జాగృత జాగృతః!!

7. యావత్కాల భవేత్ కర్మ   తావత్ తిష్ఠన్తి జన్తవః   తస్మిన్ క్షణే విన్శ్యన్తి   తత్ర కా పరిదేవనా !!

మూడింటిలో పరిమితికలిగి యుండాలని, మూడింటిలో పరిమితి అవసరంలేదని పెద్దలు చెపుతూంటారు. విషయసేవనం, భోజనం, ధనార్జన - అను ఈ మూడింటిలో పరిమితి కలిగియుండాలని, అధ్యయనం, జపం, దానం అను ఈ మూడింటిలో పరిమితి అవసరం లేదని మహనీయులు అంటున్నారు.

ధర్మవిరుద్ధం కానట్టియు, పరిమిత సంతానం కొరకైనట్టియు అగు విషయసేవనము నిషేధింపబడలేదు. అయితే ఇది గృహస్థులకు మాత్రమే అని గ్రహించాలి. తక్కిన వారికి విషయసేవనం పూర్ణనిషిద్ధమే ఔతుంది.

రోజూ ప్రతివారు పఠించదగిన విష్ణుస్తోత్రము భీష్ముడు ఈవిధంగా చెప్పాడు. 

ఓం నమో భగవతే వాసుదేవాయ

నమః పురుషోత్తమాయ

నమస్సర్వలోక గురవే

నమస్సర్వలోక పిత్రే

నమస్సర్వలోక పితామహాయ

నమస్సర్వలోక ప్రపితామహాయ

నమస్సర్వలోక ప్రధానాయ

నమస్సర్వలోకేశ్వరాయ

నమస్సర్వలోక విశిష్టాయ

నమస్సర్వలోక సుఖప్రదాయ

నమస్సర్వలోక కర్త్రే

నమస్సర్వలోక భర్త్రే

నమస్సర్వలోక హర్త్రే

నమస్సర్వలోక నిధయే

నమస్సర్వలోక నిధానాయ

నమస్సర్వలోక హితాయ

నమస్సర్వలోక హితకరాయ

నమస్సర్వలోకోద్భవాయ

నమస్సర్వలోకోద్భవకరాయ

నమో విష్ణవే ప్రభవిష్ణవే