అన్ని జన్మలలోను మానవ జన్మ దుర్లభమైనది మరియు ఉత్తమమైనది. మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాడు. చేసిన ప్రతి కర్మకు ఫలితము అనుభవించి తీరాలి. ఈ ఫలితాలనే కర్మ ఫలములు అని కూడా అంటారు. ఈ కర్మ ఫలములు అనేక జన్మలు జీవుడితో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాయి. పుణ్య కర్మలు పక్వానికి వచ్చినప్పుడు దేవలోకంలో జన్మించి ఆ భోగములను అనుభవించి తిరిగి మనుషుడుగా జన్మ ఎత్తుతాడు. దేవలోకంలో కర్మ చేసే వీలు ఉండదు. అది భోగ భూమి. "క్షీనే పుణ్యే మర్త్యలోకం విశంతి". అలానే పాప కర్మలు పక్వానికి వస్తే జీవుడు జంతువులూ, పశువులు, పక్షులు, క్రీములు, కీటకాలుగా నీచ యోనులయందు జన్మిస్తాడు. అనేక బాధలు అనుభవిస్తాడు. ఈ జన్మలలో కూడా శరీరం మనస్సు ఉంటాయి గాని బుద్ది మాత్రం ఉండదు. కాబట్టి జంతు జన్మలో కూడా భగవంతుని సాక్షాత్కారము కలిగే అవకాశమే లేదు.

ఏడు చేపల కథ చిన్న పిల్లలకు ఎంతో పరిచయం ఉన్న కథ మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకునే కథ. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడు కులు. ఏడుగురు కొడుకులు ఒకనాడు వేటకు వెళ్ళి ఏడు చేపలను వేటాడారు. వేటాడిన చేపలను ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేపా, చేపా ఎందుకు ఎండలేదు అని అడిగారు. 

గడ్డిమేటు అడ్డొచ్చింది అంది. గడ్డిమేటా గడ్డిమేటా ఎందుకు అడ్డొచ్చావ్‌? అని అడిగారు.
ఆవు మేయలేదు అంది. ఆవా, ఆవా ఎందుకు మేయలేదు? అని అడిగారు.
గొల్లవాడు నన్ను మేపలేదు అంది. గొల్లవాడా గొల్లవాడా ఆవును ఎందుకు మేపలేదు? అని అడిగారు.
అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు. అమ్మా అమ్మా ఎందుకు అన్నం పెట్టలేదు? అని అడిగారు.
పిల్లవాడు ఏడ్చాడు అంది. పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడ్చావ్‌? అని అడిగారు.
చీమ కుట్టింది అన్నాడు. చీమా టీమ్ ఎందుకు కుట్టావ్‌? అన్నారు.
నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది.

ఎన్నో అసహజాలు, అసంగతాలు అయిన సన్నివేశాలు ఉన్నా, ... రీజనింగ్‌ అడగకుండా, ఆలోచించకుండా వినే గొప్ప తెలుగు కథ ఈ ఏడు చేపల కథ.

నారద పురాణము అగ్ని పురాణము, గరుడ పురాణముల వలెనె విజ్ఞానమును తెలియ చేసే పురాణము. నారద పురాణము విష్ణువు ప్రధాన దైవమని, ఆయననించే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వుద్భవించారని చెప్తుంది. నారద పురాణము ప్రతిపాదించే వైష్ణవ, శైవ, శాక్తేయ, తాంత్రిక శాఖలు అన్ని పురాణం వాఙ్మయానికి అతి ముఖ్యమైనవే.

భారతీయ తత్వ శాస్త్రములోని ఆరు అంగములను నారద పురాణము సమానముగా పరిగణించింది. ఆత్మ పరమాత్మలో ఐక్యం అయ్యే విధానమును నారద పురాణము చాల చక్కగా వివరిస్తుంది. ఆధ్యాత్మ తత్వాన్ని, మోక్ష ధర్మాన్ని అద్వితీయంగా వివరించే పురాణము నారద పురాణము.

1933లో పరమాచార్య స్వామివారు వారణాసిలో ఉన్నప్పటి సంఘటన. కాశి మహారాజు రాజభవనంలో మహాస్వామివారిని స్వాగతించారు. అక్కడ ఎందరో విద్వాంసులు పండితులు ఉన్నారు. అక్కడున్న కొద్దిమంది పండితులకి స్వామివారిపై కొంచం అసూయ. పరమాచార్య స్వామికి జగద్గురు బిరుదు ఎలా సంభావ్యం అన్నది వారి కడుపుమంట.

అక్కడున్న వారిలో ఒక పండితుడు, “ఈ జగద్గురువు ఎవరు?” అని అడిగాడు. స్వామివారు మర్యాదతో, “నేనే” అని సమాధానమిచ్చారు. ఆ పండితుడు వ్యంగంగా “తమరు జగద్గురువు” అన్నాడు.

అందుకు స్వామివారు “जगतां गुरुः न – నేను జగద్గురువు అని అంటే దాని అర్థం నేను ఈ జగత్తుకు గురువు అని కాదు అర్థం.

जगति पद्यमनाः सर्वे मम गुरवः - విశ్వాంలోని అన్ని ప్రాణులు నాకు గురువులు అని అర్థం” అని చెప్పారు.

స్త్రీ గర్భములోనే దు:ఖముతో జీవుడు ప్రవేశిస్తాడు.

ఫలదీకరణము జరిగిన తరువాత .... ఒక రోజుకు ఖలిలమౌతాడు. ఐదు రోజులకు బుద్భుదాకారము పొందుతుంది. పది రోజులకు బదరీఫలములాగా కఠినమైన మాంసపు ముద్దగా తయారవుతాడు. ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది. రెండు నెలలకు బాహువులు తదితర అవయవాలు ఏర్పడుతాయి. మూడు నెలలకు గోళ్లు, రోమాలు, చర్మము, లింగము, నవరంధ్రములు ఏర్పడుతాయి. నాలుగు నెలలకు సప్త ధాతువులు ఉద్భవిస్తాయి. ఐదు నెలలకు ఆకలి దప్పికలు ఏర్పడుతాయి. ఆరు నెలలకు జరాయువు, మావిచేకప్పబడి గర్భంలో దక్షిణాన తిరుగుతుంటాడు.

Search LAtelugu