ఈ ప్రపంచంలో జీవించటానికి ఉత్కృష్టమైన మార్గమేది? అని ఒక శిష్యుడు తన సందేహం ను ఒకసారి గురువుగారిని అడిగితే దానికి గురువుగారు ఇలా జవాబు చెప్పారు:

నీ విధ్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించు. నీ మనసును మాత్రం ఆ పరమాత్మునిపైనే నిలకడగా ఉంచి సాధనచెయ్యి. నీ భార్యాబిడ్డలతో జీవనం సాగించు. వాళ్ళు నీకెంతో ప్రియాతిప్రియమైనవాళ్ళుగానే వ్యవహరించు. నీ అంతరంగంలో మాత్రం వాళ్ళు నీకేమీ కానట్టు భావించు.

మనం చేసే ఆచమనంలో వైదికాంశాలతోపాటు వైజ్ఞానిక రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి.

మన గొంతులో 'స్వరపేటిక' శరీర అంతర్భాగం. మనం చేసే ధ్వనులు అంటే మన మాటలు స్వరపేటిక నుండే పుడతాయి. మన ధ్వని గాంభీర్యానికి, స్పష్టతకు ఈ స్వరపేటికే ఆధారం. స్వరపేటికలోకి గాలి జొరబడినప్పుడు అంటే మన శ్వాసకోశాల నుండి వెలువడే ఉచ్ఛ్వాస వాయువు ధ్వని తంతులమీదుగా పయనించినప్పుడు, ఈ ధ్వని తంతువులలో ఏర్పడిన శబ్దాలు బయటకు రావడానికి నోరు, ముక్కు రంధ్రాలు సహాయపడతాయి.

మనం చదువుకునే రామాయణం ఇక్ష్వాకు వంశ రాజుల చరిత్ర. ఆ ఇక్ష్వాకు వంశ రాజు పాలించే రాజ్యం కోసల. ఆ కోసల రాజ్య రాజధాని అయోధ్య. రామాయణ బాల కాండలో మనకి అయోధ్య వర్ణన వస్తుంది. కోసల రాజ్యం సరయు నదీతీరంలో ఉండేది. ఆ దేశము ఎల్లపుడు ధన ధాన్యములతో నిండి ఎంతో ఆనందముగా వుండే ప్రజలతో అలరారుతుండేది. ఒక దేశములో ఏవి ఉండాలో మనకి అయోధ్య వర్ణన తెలియ చేస్తుంది. అయోధ్య లో ఎన్నో సాంస్కృతిక సంఘములు ఉండేవి. ఎన్నో ఉద్యానవనములతో ఎంతో అందముగా తీర్చి దిద్దబడిన దేశము. ఆ దేశము చుట్టూరా దుర్భేద్యమైన ఎత్తైన ప్రాకారములు ఉండేవి. ఆ ప్రకారము వెలువల లోతైన అగడ్త ఉండేది.

ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్భలం గా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకం తో పఠించిన మీ మనసు తేలిక పడి యధార్థమైన త్రోవ భోధ పడుతుంది… ఇది సుందరకాండ లో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్యనూ లక్ష్మణుని, సుగ్రీవుని కీర్తుస్తూ సీతమ్మ కి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం…

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |

ఆది శంకరులు మనిషి ఎలా ఉండాలో భజ గోవిందం ద్వారా కొట్టినట్లు తెలియచేసారు. వాటిలో కొన్ని....

  • గోవిందుని భజించు. నీవు పాఠశాలలో నేర్చుకున్న విద్యాబుద్ధులు నీకు ధనార్జనకే తప్ప మోక్షమునకు పనికిరావు. 
  • ధనసంపాదన మీద ఆశ విడిచిపెట్టు.
  • నీ కర్తవ్య కర్మల ద్వారా ఎంత ధనాన్ని సంపాదిస్తావో దానితో సంతోషంగా ఉండు.
  • ఎంతవరకు ధన సంపాదన చెయ్యగలుగుతారో అంతవరకే తనవారంతా ప్రేమగా ఉంటారు.
  • ధనమున్నదని, పరిచారకులు వున్నారని, యౌవనం ఉన్నదని గర్వించకు. అవన్నీ నశించేవే. డబ్బు పోయిన తర్వాత పరిచారకులు ఉండరు.
  • డబ్బు దుఃఖాన్ని ఇస్తుందని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో. దాని వల్ల కొంచం సుఖం కూడా లేదు అనే మాట సత్యం.
  • ధనవంతునికి తన కుమారుని వల్ల కూడా భయమే.

Search LAtelugu