ఒక జింక ఉంది అనుకుందాం!! దాన్ని వలలో వేసుకివడానికి బోయవాడు వేణువు ఊదాడు. అప్పుడు ఆ జింక శ్రవణేంద్రియం ఆ వేణు గానం పట్ల అక్షర్షితమై అలాగే మైమర్చిపోతుంది. అప్పుడా జింక సులభంగా బోయవాడికి పట్టుబడిపోతుంది...... ఇక్కడ జరిగేది ఏంటి అంటే.... కృష్ణ జింక తన చెవులని తన ఆధీనంలో ఉంచుకోలేకపోయింది. ఆపద కొని తెచ్చుకున్నది....

ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది.
దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.
మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!

ఇంద్రియాలను అదుపు చేయడానికి ధ్యానప్రక్రియ ఒక సాధనం మాత్రమే. అంతేకానీ, ధ్యానం చేస్తే చాలు ఇంద్రియాలు అదుపులోకొస్తాయి, జితేంద్రియులమై పోతాము అనే ఆలోచన కేవలం అపోహ మాత్రమేనని చెబుతూ, ధ్యానానంతరం జితేంద్రియుడినై పోయాను అనుకునే కొందరు భిక్షువులకు బుద్ధుడు ఇలా బోధించాడు.

భీష్ముడు పరమపథం చేరిన మాఘశుద్ధ అష్టమిని "భీష్మాష్టమి''గాను, మాఘశుద్ధ ఏకాదశిని "భీష్మఏకాదశి''గాను మానవాళి స్మరించడమే, మనం ఆ పితామహునకు యిచ్చే అశ్రుతర్పణాలు. భారతజాతి మొత్తం ఆయనకు వారసులే. అందుకే జాతి, మత, కులభేదాలు విస్మరించి అందరూ ఆ మహాయోధునికి ఈ భీష్మఏకాదశి పర్వదినంనాడు తిలాంజలులు సమర్పించాలి.

"వైయాఘ్రపద్య గోత్రాయ సాంకృత్యప్రవరాయచ
గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే
అపుత్రాయ జాలందద్మి నమో భీష్మాయ వర్మణే
భీషశ్శాంతనవో వీర స్సత్యవాదీ జితేంద్రియః
ఆభిరర్బివాప్నోటు పుత్రపౌత్రో చితాం క్రియమ్ ''

గంగా, శంతనుల కుమారుడైన దేవవ్రతుడు, శంతనుని భార్యయైన సత్యవతి కోరిక మేరకు, రాజ్యాధికారాన్ని, వివాహాన్ని వదులుకొని, బ్రహ్మచర్య దీక్షతో జీవితాంతం గడుపుతానని “భీషణ” మైన ప్రతిజ్ఞ చేసి, దానికి కట్టుబడి ఉన్నందున “భీష్ముడు” అని పిలవబడ్డాడు. ఏ కురువంశ సంరక్షణ చేస్తానని తండ్రికి మాట ఇచ్చాడో, చిత్రాంగద, విచిత్రవీర్యుల మరణం తర్వాత ఆ కౌరవుల వంశం నిలిచిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా, ఆయన తన ప్రతిజ్ఞను మీరలేదు. తాను చేసిన భీషణ ప్రతిగ్నకు కట్టుబడి అనేకసార్లు తనకు పరీక్షలు ఎదురైనప్పటికీ తన ప్రతిజ్ఞ నుండి వెడలలేదు. ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని సత్యవతి యొక్క పుత్ర పౌత్రులను సంరక్షిస్తానని ప్రతిజ్ఞని జీవిత పర్యంతం నిలబెట్టుకున్నాడు.

Search LAtelugu