మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే...

మదశిఖి పింఛాలంకృత చికురే
మహనీయ కపోల విజిత ముకురే

శ్రీ రమణీ కుచ దుర్గ విహారే
సేవక జన మందిర మందారే

పరమహంస ముఖ చంద్ర చకోరే
పరిపూరిత మురళీ రవ ధారే..

Nike Hypervenom Phantom II FG Low

భావము:

ఓ మనసా! బ్రహ్మములో తరించుము.

1. ఎవని కేశములు నెమలి పించముతో అలంకరించబడి ఉన్నవో, ఎవని అందమైన చేక్కిళ్ళు దర్పణ సౌందర్యమును మించి యున్నవో అట్టి బ్రహ్మములో రమించుము.

2. లక్ష్మీదేవి యొక్క కుచదుర్గముల యందు విహరించువాడును, సేవకులైన భక్తులకు కల్పవృక్షము వంటివాడును అగు బ్రహ్మములో త రించుము.

3. చంద్రకిరణములతో తృప్తిచెందు చకోరమువలె పరమహంసల మొగముల యందు వెలుగు దివ్యప్రకాశములో రమించువాడును, వేణువు ద్వారా సదా మధురనాదమును పలికించువాడును అగు బ్రహ్మములో రమించుము

Search LAtelugu