కర్మలు ఏమిటి అన్నది ఈ క్రింది బ్లాగ్ లో చదవొచ్చు...

http://latelugu.com/index.php/devotional/1529-karma-siddantam

మనకి పుట్టుక ప్రారబ్ధ కర్మ ఫలములను అనుభవించడానికి వస్తుంది. ప్రారబ్ధ కర్మలు సంచిత కర్మలనుండి వస్తున్నాయి. ప్రారబ్ధం ఉండకూడదు అంటే సంచిత కర్మలు ఉండకూడదు. సంచిత కర్మలు ఆగామి కర్మలనుండి వస్తున్నాయి. మనం ముందు జన్మలలో చేసిన ఆగామి కర్మలు ఫలములను ఇవ్వకపోతే అవి సంచితములుగా మారి జీవుడితో ఉంటాయి. అంటే మనం అసలు కర్మలే చెయ్యకపోతే మనకి మరుజన్మ ఉండదు. కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు.

భగవద్గితలో భగవానుడు "నహికశ్చిత్ క్షణమపి జతుతిష్టత్య కర్మకృత్" - మనిషి కర్మ చెయ్యకుండా ఒక్క క్షణం కూడా వుండలేడు అని ఖచ్చితంగా చెప్పేసాడు. ఈ లోకంలో కర్మలు చేస్తూనే నూరేళ్లు జీవించాలి. కర్మ కళంకాన్ని ఇవ్వదు. కర్మలు చెయ్యడం తప్ప మనుష్యునికి వేరే మార్గం లేదు. పాప కర్మలు చేస్తే నీచ యోనులలో జన్మించాలి. పుణ్య కర్మలు చేస్తే దేవయోనులయందు జన్మించాలి. రెండు చేస్తే మానవ జన్మ తీసుకోవాలి. ఎలా అయినా కర్మ బంధం తప్పదు. ఎలాంటి కర్మలైనా సంకెళ్లే. మరి ఎలా?

పాములను ఆడించేవాడు ఎలా అయితే పాము కోరలు పీకి తన జీవనమును సాగిస్తాడో అలానే మనిషి కూడా కర్మలను చేసేటప్పుడు కర్మఫలాలనే కోరలను పీకి కర్మలను చెయ్యాలి.

ఆగామి కర్మలను చేసేటప్పుడు అవి సంచితములు కాకుండా జాగర్త పడొచ్చు. ప్రారబ్ద కర్మలను ఖర్చు పెట్టుకోవోచ్చు. కానీ అనేక జన్మలనుండి మనతో వస్తున్నా సంచిత కర్మలు ఎలా పోతాయి? సంచితములను జ్ఞానాగ్నిలో దగ్ధం చెయ్యాలి.

ఈ విధం గా కొత్తగా కర్మ ఫలములు చేరకుండా, ప్రస్తుతం అనుభవించవలసి వాటిని అనుభవిస్తూ, జ్ఞానాగ్నిలో ఉన్నవాటిని దగ్ధం చేస్తే ఇక కర్మ ఫలములు వుండవు. బంధాలు వుండవు. జన్మలు వుండవు. అదే మోక్షం. అదే శాశ్వతానందం. అదే ముక్తి.

కానీ ఆలా చెయ్యాలంటే చాల సాధన కావాలి. ఆ సాధనకు సులభ మార్గం చూపించేది భగవద్గిత. చాల సునాయాసంగా కర్మలను ఎలా చెయ్యాలో, ఎలా దగ్ధం చెయ్యాలో, ఎలా అనుభావించాలో చెప్పే ఉపనిషత్తుల సారం, బ్రహ్మ విద్యా ప్రభోదం, యోగ శాస్త్రం "భగవద్గిత".

కర్మషట్కమ్ (1 - 6 అధ్యాయములు) - కర్మ యోగం - ఆగామి కర్మలు ఎలా చెయ్యాలో చెప్తుంది.
భక్తిషట్కమ్ (7 - 12 అధ్యాయములు) - భక్తి యోగం - ప్రారబ్ధ కర్మలను ఎలా అనుభావించాలో చెప్తుంది.
జ్ఞానషట్కమ్ (13 - 18 అధ్యాయములు) - జ్ఞాన యోగం - సంచిత కర్మలను ఎలా దగ్ధం చేసుకోవాలో చెప్తుంది.

భగవద్గిత ద్వారా శ్రీకృష్ణుడు ఎలా కర్మలు చెయ్యాలో చాల చక్కగా మానవ లోకానికి అందించాడు. భగవద్గితలోని ఉపాయాలను సాధన రహస్యాలను అర్ధం చేసుకొని ఆచరిస్తే కర్మ బంధ విముక్తులమై మోక్షమును పొందవొచ్చు.

జై శ్రీమన్నారాయణ

Search LAtelugu