సుందరకాండ రామాయణంలో ఐదవ కాండ. హనుమంతుడు లంకా లంఘనానికి మహేంద్రగిరి మీదకు చేరుకోవడంతో కిష్కింధకాండ ముగుస్తుంది. సరిగ్గా అక్కడితో వాల్మీకి రామాయణం 11999 శ్లోకాలు పూర్తి అయి, సుందరకాండ మొదటి శ్లోకం 12000వ శ్లోకంతో మొదలవుతుంది. సుందరకాండను "పారాయణ కాండ" అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు. వాల్మీకి మహర్షి అన్ని కాండలకు ఆయా కథాభాగానికి సంబధించిన పేర్లు పెట్టాడు. కాని సుందరకాండకు "సుందరకాండ" అని పేరు పెట్టడానికి గల కారణాలను పండితులు చాలా రకాలైన వివరణలు, వ్యాఖ్యానాలు చెప్పారు.

Nike Air Max 720

ఆత్మీయతతో ఆదరాభిమానములు నిండారియున్నప్పుడు ఆలుమగలు ఒకరికొకరు అందముగా వుంటారు. తల్లి తండ్రులకు తమ పిల్లలు అందముగా వుంటారు. ఇవన్నీ సహజమైన సౌందర్యములు. కానీ సుందరకాండలో వర్ణించే సౌందర్యము సహజ సౌందర్యమునకు అతీతముగా అద్భుతముగా వుండే సౌందర్యము. ప్రాచుర్యంలో ఉన్న శ్లోకం దీనికి వివరణ ఇస్తుంది.

సుందరే సుందరో రామ: సుందరే సుందరీ కథ:
సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి:
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం?

సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథ ను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీత కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ. సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంకార శబ్ధాలతో చెప్పబడినది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ. పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతున్నది కావున సుందరకాండ. ఈ సుందరకాండ లో సుందరం కానిది ఏది?

శ్రీరాముడు పురుషమోహనాకారుడు, సుగుణ సుందరుడు. భువనైక సుందరి సీతమ్మతల్లి. కాంచనాద్రి కమనీయ విగ్రహుడైన హనుమంతుడు పరమ సుందరుడు. అశోకవనము అతిలోక సుందరము. శ్రీ సీత రామ హనుమంతుల మహా మంత్రములు దివ్యములు, సుందరములు. ఈ మహితాత్ముల కధ సర్వాద్భుత సుందరము.

అన్ని కాండలలో రాముడు ప్రత్యక్షంగా కనిపించి కథానాయకుడుగా ఉంటాడు. కాని సుందరకాండలో హనుమంతుని చేత శ్రీరాముని నామం ముమ్మార్లు స్మరించబడుతుంది. శ్రీరామ పాత్ర ప్రత్యక్షంగా కనిపించక పోయినా, నామం మాత్రం ఉపాసన చేయబడుతుంది లేదా జపింపబడుతుంది.

పంచమ వేదమైన మహాభారతమున భగవద్గిత ఉపనిషత్సారముగా వాసికెక్కి నిత్య పారాయణ గ్రంధముగా వున్నది. అలానే వేదసారమైన శ్రీమద్రామాయణమున కాండాలన్నిటిలోను సుందర కాండము నిత్యమూ పారాయణ చేయవలసిన కాండము.

శ్రీరామాదుల బాల్య లీలలను వర్ణించినందున అది బాలకాండ. పట్టాభిషేక సన్నివేశములు అయోధ్యలో జరిగినందుకుగాను అయోధ్య కాండ. శ్రీ సీత రామ అరణ్యవాస విషయములను వివర్చించినది గావున అది అరణ్య కాండ. రామ సుగ్రీవుల మైత్రి, వాలి వధ కిష్కిందలో జరిగినందుకు గాను కిష్కింద కాండ. రామ రావణుల యుద్ధమును వర్ణించింది యుద్ధ కాండ.

కిష్కింద కాండకు యుద్ధ కాండకు మధ్య ఉన్నటువంటి సుందరమైన కాండ సుందరకాండ. వాస్తు సౌందర్యము, సీతారాముల సౌందర్యము, హనుమద్ వైభవము, సీతాన్వేషణలో ఎదురైనా ఘట్టముల సౌందర్యము, లంకా సౌందర్యము, అశోకవన సౌందర్యము మున్నగువానిని బట్టి ఇది సుందరకాండగా పేరుగాంచినది.

హంసో యధా రాజతపంజరస్థ
సింహా యధా మందరకన్దరస్థ
వీరో యధా గర్విత కుంజరస్తః
చంద్రో అపి బభ్రాజ తదామ్బరస్థ

జై శ్రీ రామ్

Search LAtelugu