మరణించిన తరువాత జీవుడు యమమార్గమునకు దారిలో ఆహరం దొరకక, నీరు దొరకక, ముళ్ళు గుచ్చుకుంటూ, పాములు కరుస్తూ, తేళ్లు కుడుతూ, అగ్ని కాలుస్తూ యాతన అనుభవిస్తూవుంటాడు. రెండు వేల యోజనాల పొడవు, వెడల్పు వుండే "అసిపత్రం" అనే అరణ్యం దాటాక వైతరణి నది వస్తుంది.

ఎవరు వైతరిణికి వెళ్తారు?
స్త్రీని భాదించేవాడు, దేవుని ద్రవ్యమును తీసుకునేవాడు, పిల్లల కోసం వాడవలసిన డబ్బు తీసుకునేవాడు, స్త్రీ ధనం తీసుకునేవాడు, వరకట్నం తీసుకునేవాడు, అప్పుని తిరిగి తీర్చనివాడు, ఎదుటివారి దోషములను మాత్రమే ఎత్తిచూపేవాడు, ఎదుటివాడిని చూసి అసూయ చెందేటటువంటి వాడు. నీచులపట్ల అనురాగం ఉండేటటువంటి వాడు, సత్సాంగత్యంపై సుముఖత లేని వాడు, తీర్ధములని, సత్కర్మలని, గురువులని నిందించేవాడు, వేదములను, పురాణములను, న్యాయ మీమాంసములను దూషించేవాడు, ఏడుస్తున్నవాడిని చూసి నవ్వుకునేవాడు, నవ్వేవాడ్ని చూసి ఏడ్చేవాడు, దుష్ట వాక్యములని వినేవాడు, అనేవాడు, దుష్ట చిత్తము కలిగినవాడు, హితవాక్యములని, శాస్త్రవాక్యములని విననివారు, తనని తానూ గొప్ప (Ego) అనుకునేవాడు, తల్లి తండ్రులను అవమానించేవాడు, భార్యని దుఃఖ పెట్టేటటువంటి వాడు, దానం ఇస్తాను అని ఇవ్వని వాడు, దానం తగ్గించి ఇచ్చినవాడు, దానం ఇచ్చి ఏడ్చినవాడు, భూములు కబ్జా చేసినవాడు, పచ్చని చెట్లు నరికేవాడు, భర్తను దూషించే వారు, ఆవుని దానం చెయ్యని వాడు ఇలాంటి వాళ్ళందరూ ఏడుస్తూనే వెళ్లి దుఃఖాన్ని అనుభవిస్తారు.

Nike Fingertrap Air Max

వైతరణి నది వివరణ
వైతరణి నది వెడల్పు నూరామడలు. ఆ నదిలో చీము రక్తము ప్రవహిస్తూ ఉంటుంది. నది వడ్డున ఎముకలు, వెంట్రుకలు, రక్తమాంసాలు గుట్టలుగా పడి ఉంటాయి. అనేకమైన క్రూర పక్షులు పైన తిరుగుతూ ఉంటాయి. పాపాత్ముని చూడగానే ఆ నది సలసల కాగడం మొదలవుతుంది. సూదులు వంటి ముక్కులు కలిగిన పురుగులు అక్కడ చేరతాయి. పెద్ద పెద్ద గద్దలు, కాకులు అక్కడికి చేరతాయి. మాంసం తినే కోతులు, మొసళ్ళు, జలగలు, చేపలు, తాబేళ్లు అక్కడికి చేరుకుంటాయి.

పాపాత్ములు ఆ నదిలో పడి బాధలు భరించలేక ఏడుస్తూ వుంటారు. ఆకలి దప్పికలు తీర్చుకోడానికి ఆ నదిలో రక్తం తాగుతూ మాంసం తింటూ జీవుడు ఏడుస్తూ ఉంటాడు. ఆ నదిలో పడినవాడికి తప్పించుకునే అవకాశమే లేదు. ఆ నదిలో సుడిగుండాలలో పడి కొట్టుకుపోతు వుంటారు.

పాపులని తాళ్లతో కట్టి, సూలములతో గుచ్చుతూ, ముక్కుకి చెవులకి తాళ్లు కట్టి వైతరణి నది దగ్గరకు లాక్కొని వస్తూవుంటారు. యమదూతలు పెట్టే బాధని తట్టుకోలేక జీవుడు తనవారినందరిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. పుణ్యం చేత లభించిన మానవజన్మ వ్యర్థం చేసుకున్నానని బాధపడుతూ ఉంటాడు.

ఈ విధంగా బాధపడుతున్న జీవుడు తన పురాకృత పాపాలను తలచుకుంటూ బాధపడుతూ, జీవుడు పదిహేడు రోజులు నడిచి, పద్దెనిమిదవ రోజున సౌమ్యపురానికి చేరుకుంటాడు. ఆ నగరంలో ప్రేతాగణాలు ఉంటాయి. అక్కడ "పుష్పభద్రా" అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. యమభటులు అక్కడ కాసేపు జీవుని విశ్రమింప చేస్తారు. అక్కడ జీవునికి తన బంధుత్వాలు అన్ని గుర్తుకు వచ్చి విచారిస్తూ ఉంటాడు. జీవుడు చేసిన కర్మ ఫలం అనుభవించక తప్పదు అని యమభటులు హితబోధ చేస్తారు. ఈ విధంగా భోదిస్తూనే జీవుని ముద్గరాలతో కొడుతూ వుంటారు. భయంతో జీవుడు పరుగులు తీస్తూ ఉంటాడు. అక్కడినుంచి మాసికం నాడు బంధువులు పెట్టిన పిండాన్ని తిని జీవుడు "సౌరిపురానికి" బయలు దేరుతాడు.

శివమ్ శివామ్ హరిం సూర్యం గణేశం సద్గురుమ్ బుధం - వీరిని నిత్యమూ ధ్యానిస్తే మనకి  శుభం కలుగుతుంది.

Search LAtelugu