న్యాయ నిర్మాయకొనేయొ న్యాయగంయో నిరంజనః 
సహస్రమూర్ధా దేవేంద్రహ సర్వశాస్త్ర ప్రభంజనః

సర్వశాస్త్రములనగా అవి చతుర్విద్యాలు, షడ్విద్యలు, చతుర్వేదములు మరియు అష్టాదశ విద్యలు. అవి

చతుర్విద్యలు
1 అన్వీక్షకి - విజ్ఞాన సందోహము
2 త్రయీ - ధర్మాధర్మములు తెలియచేయు విద్య
3 వార్త - అర్ధానర్ధములు తెలియచేయు విద్య
4 దండనీతి - నీతి అవినీతి, న్యాయ అన్యాయములను తెలియచేయు విద్య

New Arrivals

షడ్విద్యలు

1. ఆకర్షణము - ఎదుటివానిని తనవైపుకు ఆకర్షించుకొనునట్లు చేయుటయందు కౌశలము.

2. స్తంభనము - ఐదు రకాల స్తంభనములు 

 • అగ్నిస్తంభనము - అగ్ని ప్రవేశము చేసినను యోగ విద్య ద్వారా శరీరము కాలకుండా అగ్ని జ్వాలలను స్తంభింప చేయుటయందు కౌశలము.
 • ఖడ్గస్తంభనము - ఖడ్గముచే నరికినను యోగ ప్రక్రియ ద్వారా శరీరము కోతకు గురికాకుండా ఖడ్గ ప్రహరణమును స్తంభింపచేయుటయందు కౌశలము.
 • జలస్తంభనము - నీట మునిగినను శరీరమునకు నీటిని శరీరమునకు తగులకుండా స్తంభింపచేయు యోగ ప్రక్రియ యందు కౌశలము.
 • వాక్స్తంభనము - ఎదుటివాడి నోరు పడునట్లు చేసి మాటను స్తంభింప చేయుటయందు కౌశలము.
 • వయస్తంభనము - యోగ ప్రక్రియ ద్వారా వృద్ధాప్యము రాకుండా వయస్సును స్తంభింపచేయుటయందు అభినివేశము.

3 మారణము - గుట్టు చప్పడు కాకుండా శత్రువులైన వారిని చంపుట యందు ప్రావీణ్యము

4 విద్వేషణము - ఎదుటివారిని వారి కిష్టులైనవారియందు కూడా ద్వేషభావనము కలుగచేయుట యందు కౌశలము.

5 ఉచ్చాటనము - చేతబడి. బాణామతి, చిల్లంగి, భూతవైద్యము ఇత్యాది వామాచారా ప్రక్రియలందు కౌశలము.

6 మోహనము - ఎదుటివారిని మోహ పరవాసులను గావించుటయందు కౌశలము

చతుర్వేదములు

 1. ఋగ్వేదము
 2. యజుర్వేదము
 3. సామవేదము
 4. అధర్వణవేదము

అష్టాదశవిద్యలు: చతుర్దశవిద్యలు, ఆయుర్వేదము, ధనుర్వేదము, నీతి శాస్త్రము, అర్ధ శాస్త్రము.

షడంగములు

 1. శిక్ష - ఉదాత్తానుదాత్త స్వరములతో ఉచ్ఛరణలు
 2. కల్పము - మతపరమైన కర్మకాండలు వివరణము
 3. వ్యాకరణము - శబ్దముల విభజనను, వాక్య నిర్మాణమును గూర్చిన శాస్త్రము
 4. ఛందస్సు - పద్య లక్షణములను చెప్పు శాస్త్రము
 5. జ్యోతిషము - గ్రహముల సంచారమును వాటి ప్రభావమును వివరించు శాస్త్రము
 6. నిరుక్తము - వేదములలో వచ్చు కఠినమైన పాదముల యొక్క అర్ధ వివరణల శాస్త్రము

వేదవిరుద్ధములుగు గ్రంధములను భంగపరచువాడు సర్వశాస్త్ర ప్రభంజనుడు. ఆయుధములన్నిటిచే చేయబడు హింసాకృత్యములను తొలగించువాడు సర్వశస్త్రప్రభంజనుడు. ఖడ్గము, గదా, పరశువు, బాణము, తోమరము, చక్రము, సూలము, ముద్గరమూ, ఖట్వాఙ్గము, భిండివాలము ఇత్యాది ఆయుధ విశేషములచే భాధించబడు సజ్జనులను రక్షించే శివుడు సర్వశస్త్ర ప్రభంజనుడని కీర్తించబడుతున్నాడు.

ఓం నమః శివాయ

Search LAtelugu