ఈ 84 లక్షల జీవరాసులలో తరించుట కేవలం మనుష్యులకు మాత్రమే సాధ్యమయ్యే విషయం. తరించుట అంటే ఈ జనన మరణ చక్రమును దాటి ఆ పరమాత్మలో ఐక్యం అయిపోవటం. ఆలా తరించడానికి పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి దారి భక్తితో కూడినటువంటి కర్మాచరణము. ఆ కర్మాచరణము చేత కలిగినటువంటి జ్ఞానము చేత ఈ సంసార చక్రము నుండి విడివడుతాడు మానవుడు. ఆలా కర్మాచరణము చెయ్యడానికి మనకి ఒక ప్రమాణము (సంశయము లేని ఒక వాక్యము) మనకి కావలి. ఆ ప్రమాణమునకు అనుమానము ఉండదు. అలంటి తిరుగులేని ప్రమాణము వేదము ఒక్కటే.

Nike Jordan

వేదము ఈశ్వర ప్రోక్తము. ఈశ్వరుడే వేదము. వేదమే ఈశ్వరుడు. వేదమునకు అందుకే అపౌరుషేయము అని పేరు. అనగా వేదము ఒకరిచేత రచింపబడినది కాదు. వేదమునకు రెండు ప్రధాన ప్రయోజనములు వున్నాయి.
1 - వేదం చెప్పిన కర్మాచరణ చేత తరించి మోక్షమును పొందటం.
2 - జ్ఞానము పొందటం. వార్తొ జిజ్ఞాసు అర్ధార్ధి జ్ఞానేచ భరతర్షభ - నాకు జ్ఞానము కలగాలి. నాకు భక్తి ఉండాలి. నాకు వైరాగ్యం కావాలి. అనాయాసేన మరణం. ఇలా ఆత్మోద్ధరణ హేతువులైన కోర్కెలు ఉండాలి. ఇలాంటి కోరికలను తీర్చుకోవడానికి వేదం కావలి.

అలాంటి వేదమును ఆయా యుగములలో ఉన్నటువంటి మనుష్యుల ఆయు: ప్రమాణాలను, సమర్ధతని దృష్టిలో ఉంచుకుని అందించటానికి వ్యాసుడు వస్తూ ఉంటాడు. వ్యాసుడు ఒక మనిషి కాదు. వ్యాసుడు ఒక పదవి. వివిధ యుగములలో వివిధ కల్పములలో శ్రీమన్నారాయణుడు ఆ వ్యాస పదవిలోనికి ప్రవేశిస్తూవుంటారు. ఒకప్పుడు బృహస్పతి వ్యాసుడు. ఒకప్పుడు శుక్రాచార్యులవారు వ్యాసుడు. ఒకప్పుడు వసిష్ఠుడు వ్యాసుడు. ఒకప్పుడు త్రివర్షుడు వ్యాసుడు. ఇప్పుడు కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు. నారాయణుడే వ్యాసుడై అవతరించి మనల్ని ఉద్ధరిస్తాడు.

వ్యాసో నారాయణో హరిః | వ్యాసో నారాయణ స్వయం

సత్యవతి - పరాశరుల కుమారుడు కృష్ణ ద్వైపాయనుడు. పరాశర మహర్షి అమ్మ గర్భంలో ఉండాగానే వేదాధ్యయనం చేసిన మహానుభావుడు. పరాశర మహర్షి మనకి అద్వైతమునకు, భగవతమునకు ప్రాతిపదిక అయిన విష్ణు పురాణమును అందిచినవాడు. ఆ విష్ణు పురాణమే వ్యాసుని చేతిలో భగవతమైంది. విష్ణువుయొక్క అంశవల్ల జన్మించినవాడు వ్యాసుడు. ఆయన నల్లగా ఉంటాడు. అందరు ఆయన్ని కృష్ణ అని పిలిచేవారు. విష్ణు అంశ వల్ల జన్మించడం చేత "కృష్ణ ద్వైపాయనుడు" అని పిలవసాగారు. ఆయన యమునానది లోని ఒక ద్వీపంలో జన్మించారు. అందువలన ఆయన పేరు చివర ద్వైపాయన అని చేరింది.

వ్యాస అన్న మాట లో వకారము, యకారము, సకారము మూడు వున్నాయి. ప్రతి సంస్కృత పదము వెనక ఒక అర్ధం దాగి ఉంటుంది. బీజాక్షరము అంటే విస్ఫోటనా శక్తీ కలిగినటువంటి అక్షరము అని అర్ధము. విస్ఫోటనము అంటే ఆ అక్షరము పలకడము వలన మనకి శక్తీ వస్తుంది. అలంటి అక్షరాలతో కూడిన మంత్రాలనే పారాయణ చేస్తారు. పారాయణ చెయ్యగా శక్తీ విస్ఫోటనమయ్యి మనల్ని తేజోమయుల్ని చేసి ఈశ్వరుణ్ణి చేరుకోడానికి కావలసిన ప్రకాశమును కలుగచేస్తుంది. అటువంటి ప్రాణ ప్రదమైన బీజాక్షరాలు "వ", "య" మరియు "స".

"వ" అమృతబీజము. "య" వాయుబీజము అంటే ప్రాణ బీజం (నమస్తే వాయో: త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి). "స" సమస్త తత్వసారమును అందించగలిగినటువంటి బీజాక్షరము. ఏది అమృతత్వాన్ని ఇస్తుందో ఆ శబ్దమే వ్యాస. అంటే మరొకసారి మరణం పొందకుండా ఉండడం. అంటే మరొక జన్మ లేకుండా ఉండడం. ఒకసారి శరీరం తీసుకున్నాక విడిచిపెట్టాలి. కానీ విడిచిపెట్టేటప్పుడు భయం తో కాక, సత్యం తెలుసుకుని విడిచి పెట్టాలి. సత్యం అంటే - అద్వైతతత్వంతో ఈ శరీరం నేను కాదు నేను ఆత్మా అని గుర్తెరిగి ఆ పరబ్రహ్మస్వరూపములో ఐక్యం అవ్వటం. "మృత్యోర్మా అమృతంగమయ" - మృత్యువు నుండి నన్ను అమృతత్వమునకు తీసుకుని వెళ్ళడానికి కావలసిన వాఙ్మయమును మనకి ఇవ్వగలిగినవాడు వ్యాసుడు. ఎవరు చెప్పినా వ్యాసుడు చెప్పిన వాటినే చెప్పాలి కానీ మరేదీ చెప్పడం కుదరదు.

వ్యాసుడు లేకపోతే మన జీవనానికి అర్ధం లేదు. అలంటి వ్యాసునికి కృతజ్ఞత తెలియచేయడానికి ఆషాడ శుక్ల పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా పరిగణించి ఆ వ్యాసునికి నమస్కరించుకోవాలి.

నమోస్తుతే వ్యాస విశాల బుద్దే | విశాల పుల్లాయత పత్రనేత్ర |
యేనత్వయా భారత తైలపూర్ణ: | ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః |

వ్యాస పౌర్ణమి రూపాంతరం చెంది గురు పౌర్ణమి అని అన్నారు. వ్యాసుడు మొదటి గురువు. వ్యాసుడు చేసిన మొదటి ఉపకారం వేదం విభాగం చెయ్యడం. ఎందుకు వేదం విభజించాలి? కలియుగంలో మనుష్యుల ఆయుః ప్రమాణము నూరు సంవత్సరములు. అందుకే "శతమానం భవతి శతాయుః పురుషా శతెన్ద్రియ ఆయుషేవేంద్రియహ్ ప్రతితిష్ఠతి" అని దీవిస్తారు. ఈ నూరు సంవత్సరాలలో బ్రహ్మము గురించి ఆలోచించడానికి చాల తక్కువ కాలం! అందుకే ఆయుర్ధాయాన్ని, కలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని వేదమును నాలుగు భాగాలుగా విభజించారు. కావున ఆయనకీ "వేద వ్యాసుడు" అని పేరు వచ్చింది. వేదాలను "వ్యాసుడు" అనగా విస్తరించాడు (విస్తృత పరచినవాడు) అని కూడా అర్ధము.

వేదవ్యాసునికి ఐదుగురు శిష్యులు వున్నారు. వ్యాసుడు తన శిష్యులైన పైలుడికి - ఋగ్వేదాన్ని, వైశంపాయనుకి - యజుర్వేదాన్ని, జైమినికి - సామవేదాన్ని, సుమంతునికి - అధర్వణ వేదాన్ని బోధించాడు. వీరు ఈ వేద విభాగాలను తీసుకువెళ్లి మునీశ్వరులకు  భోదించారు. ఈ విధంగా వేదం ప్రచారమైంది.

వేదవ్యాసునికి మరో శిష్యుడు కూడా వున్నాడు. ఆయన పేరు రోమహర్షణుడు. ఆయనకి పురాణాలను, ఇతిహాసాలను బోధించాడు. ఈ రోమహర్షణునికి "లోమహర్షణుడు" అని ఇంకొక పేరు కూడా వుంది. రోమహర్షణునికి ఆరుగురు శిష్యులు వున్నారు. అకృతవ్రణ, సావర్ణి, శాoసాయన, మిత్రాయువు వాశిష్ఠ. సోమదత్త సాకర్ణ, సుశర్మ సాంసపాయన.

వ్యాసుడు తాను తెలుసుకున్న పురాణ సంహితను రోమహర్షణునికి చెప్పాడు. ఆయన తన ఆరుగురు శిష్యులకి "పురాణం సంహిత" లను బోధించాడు. వారిని ఈ పురాణ సంహితను ప్రచారం చెయ్యమని ఆజ్ఞాపించాడు. వీరిలో అకృతవ్రణ కాశ్యపుడు, సోమదత్త సావర్ణి, సుశర్మా శంపాయనులు క్రొత్తగా నాలుగు పురాణములను రచించినట్లు ప్రచారంలో వున్నా అవి ఏమిటో మనకు తెలియటం లేదు. భాగవతం శుకమహర్షి ప్రచారం చేశారు.

మనకి ఇంతటి మహోపకారాన్ని చేసిన జగద్గురువు అయిన వ్యాసునికి శిరస్సువంచి నమస్కరిద్దాం!

జై శ్రీమన్నారాయణ

Search LAtelugu