నేపధ్యం

http://latelugu.com/index.php/devotional/1502-భండాసురుడు

దేవతల ప్రార్ధన

యుద్ధం లేకుండా భండాసురుడు అన్ని లోకములలో కామ ప్రళయాన్ని సృష్టించాడు. ఇది లలిత సహస్రనామమునకు నేపధ్యం. అమ్మ ఆవిర్భావానికి కారణం.భండాసురుడు సృష్టించిన ఈ ప్రళయాన్ని దేవతలు గుర్తించగలిగారు. వైకుంఠానికి వెళ్లి స్థితి కారకుడు అయిన శ్రీ మహావిష్ణువును దేవతలు అందరు ప్రార్ధన చేశారు.

అప్ప్డుడు శ్రీ మహా విష్ణువు దేవతలతో - ఇంతకుముందు నేను అవతారములు తీసుకుని దేవతలను కాపాడిన మాట యధార్ధము. కానీ భండాసురునికి ఒక వరము వున్నది. ఈ బ్రహ్మాండములో ఎవరు భండాసురునితో యుద్ధము చెయ్యలేరు. వారిలో సగబలము భండాసురునికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ బ్రహ్మాండము నుండి ఆవలి వున్నా వాళ్ళని తీసుకు వచ్చి ఈ భండాసురుని నిర్జింప చెయ్యాలి. ఒక అమ్మను పిలవాలి. ఆవిడ రావాలి. వచ్చి భండాసురుడిని సంహరించాలి.

బ్రహ్మాండము

బ్రహ్మాండము అంటే బ్రహ్మాండమైనటువంటి గుడ్డు (oval shaped). మన పూర్వికులు మనకు ఎప్పుడో చెప్పారు ఈ బ్రహ్మాండము గుడ్డు ఆకారములో వుంది అని. దేవతలు అప్పుడు శ్రీ మహా విష్ణువుని ఎం చేస్తే ఈ బ్రహ్మాండమునకు ఆవల వున్న దేవతలు వస్తారు అని ప్రశ్నించగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక గొప్ప యజ్ఞమును చెయ్యమని దేవతలకు చెప్పారు.

ఈ మధ్యలో భండాసురుడు ఈ కార్యక్రమమును పసిగట్టకుండా ఉండడానికి ఇద్దరు కాంతలను పంపి భండుని భోగమునుకు లోనుచేసి పక్క దారి పట్టేటట్టు చేశారు. బ్రహ్మాండమునకు అంచులో హిమాలయ పర్వత శ్రేణులలో ఒక పెద్ద యజ్ఞ ప్రాంగణమును తయారు చేశారు. ఈ బ్రహ్మాండమునకు ఒక రంధ్రము తయారు చేసి ఆవలి బ్రహ్మాండమునుండి దేవతలు ఈ బ్రహ్మాండము లోనికి వచ్చేటట్లు దారి తయారు చేశారు. ఆ రంధ్రములోనించి అందరు దేవతలు ఆవలి బ్రహ్మాండము అంచు దగ్గరకి వెళ్లారు.

న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం
నేమావిద్యుతో భాతి న తోయమగ్నిహి

మన భ్రహ్మాండములాంటి ఎన్నో కోట్ల బ్రహ్మాండములని ఆ దేవేతలు అందరు చూసారు. ఇన్ని బ్రహ్మాండములకు ఎంత మంది అధినాధులో. ఇప్పుడు పెద్ద సమస్య ఏమిటంటే ఈ బ్రహ్మాండాలన్నిటిలోనించి ఎవరు వచ్చి రక్షిస్తారు అని. ఎవరిని పిలవాలి అని వారికి అనుమానము వచ్చింది. ఎవరైతే మనకి కావలసిన శక్తిని ఇవ్వగలడో అంతను శంభు దేవుడు. అతనిని అందరం ఎలుగెత్తి పిలిస్తే అతను తప్పకుండ వచ్చి మనల్ని రక్షిస్తాడు. అప్పుడు దేవతలందరు శంభుదేవుని స్తోత్రం చేశారు,

జయ ఫాల నయన! శ్రిత లోల నయన! సితశైల నయన! శర్వా!
జయ కాల కాల! జయ మృత్యు మృత్యు! జయ దేవ దేవ! శంభో!
జయ చంద్రమౌళి! నమ దింద్ర మౌళి! మని సాంద్రాహేళి! చరణా!
జయ యోగ మార్గ! జిత రాగ దుర్గ ముని యాగ భాగ! భర్గా!

శంభుదేవుని ఆవిర్భావం

అప్పుడు శంభుదేవుడు అక్కడ ఆవిర్భావమై దేవతలతో - మీకు కలిగిన ఆపత్తు నుండి మీరు రక్షింపబడాలి అంటే మీరు లలితా పరా భట్టారికా స్వరూపమునకు ప్రార్ధన చెయ్యాలి. ఆ స్వరూపం రావాలి అంటే ఒక గొప్ప యజ్ఞం చెయ్యాలి. అప్పుడు ఆ హోమగుండం లోనించి అమ్మవారు పైకి వస్తుంది. దేవతలు అందరు కలిసి హోమగుండం తయారు చేసి, ప్రార్ధన చెయ్యటం మొదలుపెట్టారు. మొదటి సమస్య ఆ యజ్ఞ గుండంలో అగ్నిహోత్రమును ప్రతిష్టించాలి.

యజ్ఞములో అగ్ని తీసుకురావడానికి మాములుగా అయితే ఆరణి మంధనము అని చేస్త్తారు. ఈ యజ్ఞములోనికి కూడా ఆరణి మంధనము చేసి అగ్నిని పుట్టించవచ్చు. కానీ ఆ అగ్ని ఈ బ్రహ్మాండములోనించి పుట్టినది అవుతుంది. భండాసురుడు సంకల్పం చేస్తే ఆ బలంలో సగం తీసేసుకుంటాడు. దేవతలు అందరు ఆలోచిస్తూవుండగా అప్పుడు శంభుదేవుడు దేవతలతో - " మనకి గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని మరియు దక్షిణాగ్ని అని మూడు అగ్నులు వున్నాయి. ఈ మూడు అగ్నులు పనికి రావు. నేను బ్రహ్మాండమునకు ఆవలి నించి "చిదగ్ని" అనబడే అగణిని బ్రహ్మాండము ఆవలినించి వాయు రూపములో తీసుకువచ్చి ఆ అగ్నిని రగలుస్తాను. మీరు దేవతలు కనుక ఆర్తితో మీ శరీర అవయవాలని కోసి దానితో హవిస్సులు ఇవ్వండి. అప్పుడు అమ్మవారు ఆవిర్భవిస్తుంది." అని చెప్పి చిదగ్నిని తీసుకువచ్చి రగిల్చారు. దేవతలందరు ఆర్తితో అమ్మవారిని ప్రార్ధించారు. దేవతలు ఇంకా శంభుదేవుడు అష్ట కారికలతో అమ్మవారికి ప్రార్ధన చేశారు.

అమ్మవారి అనుగ్రహము

అప్పుడు అమ్మవారు ఆవిర్భావం ప్రారంభమైంది. అమ్మవారి అనుగ్రహము కలిగి, మాంసనేత్రమునతో చూడడానికి వీలు లేని పరబ్రహ్మస్వరూపము అయిన అమ్మ, అందరికి కనపడేటటువంటి రూపముతో, అనేక కోట్ల భ్రహ్మాండములకు నాయకురాలైనటువంటి తల్లి, మణి ద్వీపములో కూర్చుని ఇన్ని బ్రహ్మాండములను శాసించగలిగినటువంటి తల్లి, ఈ బ్రహ్మాండంలో ఏర్పాటు చెయ్యబడినటువంటి హోమగుండం లోనించి ఆవిర్భవించడం ప్రారంభించింది. అమ్మ ఆ చిదగ్నికుండం లోనించి ఆర్విభవిస్తున్నటువంటి స్వరూపాన్ని దేవతలు చూసి ప్రార్ధన చేశారు.

విశ్వరూపిణి! సర్వాత్మే ! విశ్వభూతైక నాయకి!
లలిత పరమేశాని ! సంవిద్వహ్నే సముద్భవ !!
అనంగ రూపిణి పరే ! జగదానందదాయిని !
లలిత పరమేశాని ! సంవిద్వహ్నే సముద్భవ !!
....

దేవతలు చేసింది పైన వున్న స్తోత్రం. లలిత సహస్రనామము దేవేతలు చేసినటువంటిది కాదు.లలితా సహస్రనామము అమ్మ భండాసురిని ఎలా సంహరించిందో చెప్తుంది. భండాసురుని నిర్జించి ఆ తల్లి వెళ్లిపోతున్న సమయంలో దేవతలు మళ్ళి ప్రార్ధించి అమ్మని ఈ భోమండలంలో 16 శ్రీ పురములలో ఉండమని అడిగారు. అమ్మ సరే అని మేరు పర్వతము లో కామేశ్వరిపురి, నిషధ పర్వతం లో భాగమాలినిపురి, హేమకూటం లో నిత్యక్లిన్నాపురి, హిమాలయం లో భేరుండాపురి, గంధమాదనం లో వహ్నివాసినిపురి, నీలగిరి లో మహా వజ్రేశ్వరిపురి, మేషగిరి లో శివదూతీపురి, శృంగగిరి లో త్వరితాపురి, మహేంద్రగిరి లో కులసుందరిపురి, లవణ సముద్రం లో నిత్యాపురి, ఇక్షు సముద్రం లో నీలపతాకాపురి, సురా సముద్రం లో విజయాపురి, ఘృత సముద్రం లో సర్వమంగళాపురి, దధి సముద్రం లో జ్వాలామాలినిపురి, క్షీర సముద్రం లో చిత్రాపురి, జల సముద్రం లో మహానిత్యాపురి అని 16 శ్రీపురములలో వెలసి ఈ బ్రహ్మాండముఅంతటిని తన రక్షణ కవచములోనికి తీసుకుంది.

ఈ ఆవిర్భవించిన తల్లి స్వరూపమునకు ఋషులు పెట్టిన పేరు - లలిత. ఆ తల్లి మనల్ని కాపాడుగాక.

Search LAtelugu