ప్రతిభట శ్రేణి భీషణ వర గుణ స్తోమ భూషణ
జనిభాయ స్దాన తారణ జగడవస్థాన కారణ |
నిఖిల దుష్కర్మ కర్షణ నిగమ సద్ధర్మ దర్శన
జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన

 • చక్రం పూర్ణత్వానికి ప్రతీక. ఈ విశ్వమంతా చక్రమండలమయమే.
 • ఏడేడు పద్నాలుగు లోకాలు అన్నీ చక్రాలే. వాయు, వహ్ని, గగన, జలమండలాలన్నీ చక్రాలే! అండపిండ బ్రహ్మాండాలన్నీ చక్రాలే.
 • చక్రాన్ని ధ్యానించి, అభిషేకార్చనలతో సేవిస్తే శాంతి సౌఖ్యాలు చేకూరతాయని పురాణోక్తి. 
 • శ్రీనివాసుని పంచాయుధాలలో మూర్తిమంతంగా, దేవతగా, యంత్రరూపంగా, యంత్రాధిష్ఠానదేవతగా, దుష్టశిక్షణలో ప్రముఖాయుధంగా కీర్తింపబడేది  సుదర్శనమొక్కటే!
 • భక్తై సుఖేన దృశ్యత ఇతి... అంటే దీనిని భక్తులు సుఖంగా చూడగలరన్నమాట.
 • శ్రీవారి చక్రాయుధాన్ని కష్టాలు, దుష్టశక్తులు, శత్రువుల బారి నుండి రక్షించే మహాశక్త్యాయుధంగా విశ్వసించి, పూజిస్తారు.
 • దేవశిల్పి అయిన విశ్వకర్మ... సూర్యుణ్ణి సానబట్టేటప్పుడు రాలిన తేజస్సును పోగు చేసి, చక్రాకారమైన ఆయుధంగా రూపొందించి, మహావిష్ణువుకు ఆయుధంగా ఇచ్చాడన్నది ఒక నానుడి.
 • ఇది శ్రీహరి సంకల్పించినంతనే వచ్చి, కుడిచేతిని చేరుతుంది. ప్రయోగించగానే ఎంత బలవంతుణ్ణయినా తరిమి, సంహరించి, తిరిగి స్వస్థానానికి వస్తుంది.
 • ఈ చక్రాయుధం వల్ల మృతినొందినవారు విష్ణుదేవుని దివ్యతేజంలో లీనమవుతారు.
 • గజేంద్ర సంరక్షణకై శ్రీహరి తన చక్రాయుధాన్నే పంపాడు.
 • భాగవతంలోని అంబరీషుని వృత్తాంతంలో... దుర్వాసునికి బుద్ధి చెప్పి, అంబరీషుని రక్షించేందుకై శ్రీహరి పంపిన చక్రం ఎంత మహత్తర ప్రభావంతో, విజ్ఞతతో ప్రవర్తించిందో గమనిస్తే, అది సాక్షాత్తూ నారాయణ రూపమే అని గోచరిస్తుంది. శివబ్రహ్మాదులైన ఏ దేవతలూ ఆ చక్రాన్ని నివారించలేకపోయారు. అప్పుడు అంబరీషుడు ఆ మునిని రక్షించేందుకు చేసిన చక్రాయుధ స్తోత్రం సుదర్శన సహస్రనామ స్తోత్రంలోని అన్ని నామాల సారాంశాన్నీ పుణికిపుచ్చుకుంది.
 • దుష్టులకు సుదర్శన చక్రం ఆయుధంలా కనిపిస్తే, భక్తులందరికీ అది స్వామివారి ఆభరణంలా దర్శనమిస్తుంది.
 • సృష్టిక్రమం దోషదూషితం కాకుండా ఈ చక్రం కాపాడుతుందనేది యోగుల విశ్వాసం.
 • శ్రీవారి చక్రం అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి, జ్ఞానకాంతులను ప్రసరింపజేస్తుంది. అందుకే దీన్ని సుదర్శనం అంటారు.

 ఓం శ్రీ సుదర్శన చక్రాయ సహస్రారాయ హేతిరాజాయ నమః

Sri Sudarsana Ashtakamhttps://www.youtube.com/watch?v=jRhSMBf_Iew

Search LAtelugu