కర్ణుడు, కృష్ణుని అడిగాడు-

 • నేను జన్మించగానే నా తల్లి నన్ను వదిలేసింది. అక్రమ సంతానం అవ్వడం నా తప్పా?
 • నేను క్షత్రియ పుత్రుడిని కాదని ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పలేదు.
 • పరశురాముడు కూడా నన్ను క్షత్రియుడిగా గుర్తించి, నాకు వచ్చిన యద్ధ విద్య, అవసరమైనప్పుడు మరిచిపోయేలా శాపం ఇచ్చాడు.
 • నేను వేసిన బాణం అనుకోకుండా ఒక ఆవుకి తగిలి మరణించింది. ఇందులో నా తప్పు లేకోపోయనా, ఒక ఋషి నన్ను శపించాడు.
 • ద్రౌపతి స్వయంవరంలో నాకు అవమానం జరిగింది.
 • మాతా కుంతీ తన బిడ్డలను కాపాడుకోవడం కోసం మాత్రమే చివరిగా నాకు నా జన్మ రహస్యాన్ని చెప్పింది.
 • నాకు లాభించినది ఏదైనా ఉందంటే అది అంతా దుర్యోధనుడి ద్వారా మాత్రమే లభ్యమైంది.
 • కాబట్టి నేను దుర్యోధనుడి పక్షాన పోరాడడం తప్పు ఎలా అవుతుంది?

కృష్ణ జవాబు-

 • కర్ణా, నేను కారాగారంలో జన్మించాను.
 • నా జన్మకి ముందే నా మరణం వేచి ఉంది.
 • నిశి రాత్రిలో, జన్మించానో లేదో, తల్లి-దండ్రుల నుండి దూరమయ్యాను.
 • నీ చిన్నతనం కత్తులు, బాణాలు, రథాలు, గుర్రాలు, కోలాహలం మధ్య గడిచింది. నా బాల్యం గోపాలకుడిగా, పెడలో, మట్టిలో పొర్లాడుతూ గడిచింది. ప్రాణాపాయమైన దాడులను ఎదుర్కోవలసి వచ్చింది.
 • సైన్యం లేదు. విద్య లేదు. ప్రజలేమో వారి సమస్యలకు కారణం నేనకుని, నన్ను, నా తల్లిని దెప్పపొడిచారు. వేధించారు.
 • బాల్యం నుండే విద్య పొందే అవకాశం కలిగింది నీకు. నీ శౌర్యానికి ఉపాధ్యాయుడు పొగడ్తలు లభించాయి.  కానీ నాకు, 16 సం. వచ్చాక కానీ సాందీపనీగారు గురువుగా లభించ లేదు.
 • నీవు నీకు నచ్చిన అమ్మాయి వివాహం చేసుకున్నావు. నేను ప్రేమించిన అమ్మాయిని కాక, ఏ అమ్మాయినైతే రాక్షసుల నుండి రక్షించానో ఆమెనే పెళ్ళాడవలసి వచ్చింది.
 • నా గ్రామజనులను జరాసంధుడి నుండి రక్షించే నిమిత్తం వారిని యమున ఒడ్డు నుండి సముద్ర తీరం దగ్గరకి తీసుకు వెళ్ళి వారికి పునరావాసం కల్పించవలసి వచ్చింది. ఈ పని వలన నన్ను అందరూ భీరువని తెగిడారు.
 • రేపు యుద్ధంలో దుర్యోధనుడు విజయం సాధిస్తే నీకు గౌరవం లభిస్తుంది. కానీ, ధర్మరాజు విజయం సాధిస్తే నాకు లభించేది ఏమీ లేదు. పైగా యుద్ధం కారణంగా ఏర్పడిని సమస్యలకు నన్ను కారకుడిగా ఎంచుతారు.

కర్ణా ఒక విషయం గుర్తుంచుకో- అందరి జీవితాలు సమస్యలమయమై ఉన్నాయి. జీవితం ఎవరికి న్యాయం చేయదు. దుర్యోధనుడు అన్యాయాన్ని భరించాడనుకుంటే, యుధిష్ఠిరుడు కూడా అన్యాయాన్ని భరించాడు. నిజానికి నీవు తెలుసుకోవలసినది ఏది సత్యం. ఏది ధర్మం. నువ్వు ఎన్నో అవమానాలను భరించావు. నీకు హక్కులకు ఎంతో భంగం వాటిల్లిందనడం కాదన లేని విషయమే. ఆ సమయంలో నీవు ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నావన్నది నిజం. కానీ ఇవి కాదు అసలైన ప్రశ్నలు.

కర్ణా క్షోబించడం మాను, జీవితంలో నీకు న్యాయం జరిగి ఉండకపోవచ్చు. అంత మాత్రం చేత ఎవరికీ అధర్మ మార్గంలో నడవడానికి అనుమతి లేదు

image1

Search LAtelugu