పద్యం మొదటి నుండి చదివినా, వెనుకనుండి చదివినా, యతి ప్రాసలతో సహా, అదే పద్యం వస్తుంది , ఇది అనులోమ విలోమ కందం.
నారదుడు సత్యభామ చేత పుణ్యక వ్రతము చేయించి కృష్ణుని దానముగా గైకొని ఆయనను స్తుతించిన పద్యము

నాయశరగసారవిరయ
తాయనజయసారసుభగధరధీనియమా
మాయనిధీరధగభసుర
సాయజనయతాయరవిరసాగరశయనా!

ఇది నంది తిమ్మన గారి పారిజాతాపహరణం లోనిది. మంచి శరీరము గలవాడా!సాగరశయానా!అచలమైన బుద్ధి,కట్టుబాట్లు గలవాడా! లక్ష్మీ దేవి శుభములకు స్థాన భూతుడైన వాడా! లక్ష్మీ వాసుండును,కళ్యాణరూపుండైన శరీరము గల సుందరుడా!సర్వదేవాత్మకుడవైన వాడా!నీ నీతియను,వేగమైన బాణములచే దుర్జనులను శిక్షించి సుజనులను రక్షించి ధర్మము నెలకొల్పి అందరి మెప్పును పొందిన వాడవు వామనావతారంలో ఆకాశము నంటి సూర్యుని తేజమును మించి పోయినావు.అని నారదుడు స్తుతించెను.

 

Conseils running et course à pied pour débutants et amateurs

Search LAtelugu