ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, ఈ మూడు వేదములు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు. గాయత్రీ ఉపదేశంతో ఈ మూడు వేదములు చదువవచ్చు. అధర్వ వేదం చదవడానికి మరల ఉపనయనం చేసుకొని, బ్రహ్మోపదేశం పొందాలి. అందుకని సాధారణంగా త్రయీవేద్యం అంటారు.

ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్లుగా మూడు వేదములను పెడితే ఈ మూడు వేదములలో మధ్యలో వున్నది యజుర్వేదము. యజుర్వేదమునకు ఏడు కాండలు ఉన్నాయి. మరల యిందులో మధ్యప్రాకారము నాల్గవ కాండ. ముందు మూడు, వెనుక మూడు ఉండగా, మధ్యలో నాల్గవది వుంది. ఈ నాల్గవ కాండలో రుద్రాధ్యాయం ఉంది. రుద్రాధ్యాయంలో మధ్యలో అష్టమానువాకం వస్తుంది. అష్టమానువాకమును మీరు చదివినట్లయితే -

నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ

నమశ్శంజ్గాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ

నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హన్త్రే చ హనీయ సే చ

నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమ స్తారాయ నమశ్శంభవే చ మయోభవే చ

నమశ్శంకరాయ చ మయస్కరాయ చ నమశ్శివాయ చ శ్శివతరాయచ!!( శ్రీ రుద్రాధ్యాయం - అష్టమానువాకం-1 - 11)

ఒకసారి ఉత్తర భారతదేశం నుండి ఒక భక్తుడు మహాస్వామి వారి దర్శనానికి కంచి మఠానికి వచ్చాడు. అతను కొంచం సంకోచిస్తూ ఉన్నట్టు కనపడ్డాడు. మహాస్వామి వారు అతన్ని తన సందేహమేంటో అడగమన్నారు. అతను గొంతు సవరించుకొని ఆంజనేయస్వామి వారిని భారతదేశమంతటా ఆరాధిస్తారు కాని ఎందుకు దక్షిణ భారతంలో వడమాలలు వేస్తారు. ఉత్తర భారతంలో మమూలుగా జాంగ్రితో మాల చేసి వేస్తారు అన్నది అతని సందేహం. పైగా ఈ ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం ఇవ్వలేకపోయారని మహాస్వామి వారికి విన్నవించాడు.

మహాస్వామి వారు హనుమంతుని గురిన్చి మాట్లాడడానికి చాలా ఆనందపడిపోయారు. పిల్లలు ఎప్పుడైనా తినడానికి మారాం చేస్తే తల్లి వారికి ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ అన్నం తినిపిస్తుంది. పిల్లలు ఆ చందమామని చూస్తూ ఆ చల్లని వెన్నెలని ఆస్వాదిస్తూ భోజనం ముగిస్తారు. అలాగే బాల హనుమంతుడు ఆకాశములో ప్రకాశిస్తూ ఉన్న సూర్యబింబం చూసి చాలా ముచ్చట పడ్డాడు. అంతటితో ఆగక ఆ సూర్యబింబాన్ని చేత్తో పట్టుకోవాలని ఆకాశంలోకి ఎగిరాడు.

ఉండేది రుద్రభూమిలో. వేసుకునేది బ్రహ్మాండమైనటువంటి పుర్రెల మాల. చేతిలో పట్టుకునేది బ్రహ్మకపాలం. తాగేది చుస్తే హాలాహలం (విషం). వంటిమీద పాములు పాకుతూ ఉంటాయి. కట్టుకునే వస్త్రం రక్తమోడుతున్నటువంటి ఏనుగు తోలు. పైన కప్పుకున్నది పులి తోలు. రెండు కాదు మూడు కళ్ళు. తలమీద చంద్రవంక. పెద్ద జటాజూటం. ఇన్ని అవలక్షణాలతో వున్నవాడిలా కనపడుతూ వున్న ఆ శంకరుని మొట్ట మొదట పూజ చేసినవాడు ఆ మేఘశ్యాముడు శ్రీనివాసుడు.

అశనం గరళం ఫణీ కలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షః
మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి

శ్రీమన్నారాయణునికి అనేకమైన దివ్యమైనటువంటి శక్తులు వున్నాయి. అందులో శర సంధానం అనే అద్భుతమైనటువంటి శక్తీ స్వామికి ఉన్నదట  ( బాణాన్ని ప్రయోగించేటటువంటి శక్తి ) . అలంటి శక్తి అందరికి ఉంటుంది కదా అంటే, అందరికి ఉండడం ఒక ఎత్తు, అందులో అమోఘమైనటువంటి ప్రావీణ్యము ఉండడం ఈ నామము యొక్క విశిష్టత.

మహాన్ ఇష్వాసః యస్య (=) మహేష్వాసః

స్వామి వారి బాణ ప్రయోగం ఎంత చూడముచ్చటగా ఉంటుందో చెప్పలేము  ఇది ముఖ్యంగా రామాయణం లో సముద్రాన్ని బంధించేటప్పుడు అలాగే రావణాసురుడిని సంహరించి నప్పుడు స్వామి బాణాలను ఎలా అద్భుతంగా ప్రయోగించారో వర్ణించబడింది. "ఐసు" మరియు "ఆస" అనే రెండు పదాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఐసు అంటే బాణములు. ఆస అంటే ప్రయోగము. మహాన్ అంటే చాల గొప్పది అని అర్ధము. అత్యద్భుతంగా బాణ ప్రయోగం చెయ్యగలిగిన వాడు కనుక మన స్వామికి మహేష్వాసః అని నామం.

ప్రతిభట శ్రేణి భీషణ వర గుణ స్తోమ భూషణ
జనిభాయ స్దాన తారణ జగడవస్థాన కారణ |
నిఖిల దుష్కర్మ కర్షణ నిగమ సద్ధర్మ దర్శన
జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన